వైద్యవిద్య నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన యువకుడు..! 6 h ago
TG : అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్కి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ పూర్తి చేయకున్నా వైద్యవిద్యను అభ్యసించినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిగా చలామణీ అవుతున్న వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొని గురువారం రిమాండ్కు తరలించారు. రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్యకుమార్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.